సింగరేణి హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి

సింగరేణి హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో  ఉత్తమ ఫలితాలు సాధించాలి

గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలోని సింగరేణి హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో టెన్త్‌‌‌‌‌‌‌‌లో వంద శాతం ఫలితాలు సాధించాలని, ఆ దిశగా టీచర్లు కృషి చేయాలని సంస్థ కార్పొరేట్​ఎడ్యుకేషన్​ జీఎం వెంకటచారి కోరారు. శుక్రవారం ఆయన సింగరేణి సెక్టార్​-2 హైస్కూల్‌‌‌‌‌‌‌‌ను సందర్శించారు.

 ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సంస్థ తరఫున విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో పర్సనల్​మేనేజర్​ఎం.రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, హెచ్ఎం సంతోష్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టీచర్లు పాల్గొన్నారు.