
న్యూఢిల్లీ: ప్రభుత్వాలు, కార్పొరేట్లు తమ వాలెట్లు ఓపెన్ చేసి, ఎకానమీలో మరింత ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ రజ్‌నీష్ కుమార్ వ్యాఖ్యానించారు. కరోనా సంక్షోభం నుంచి వెంటనే ఎకానమీని కోలుకునేలా చేయడానికి ప్రభుత్వాలు, కార్పొరేట్లు మరింత కృషిచేయాలన్నారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్లు పెంచాలని సూచించారు. ప్రస్తుతం ప్రజలకు కల్పించిన లోన్ రీపేమెంట్ల మారటోరియం తన లక్ష్యాన్ని సాధించిందని అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక ఇప్పుడు బ్యాంకులకు రీస్ట్రక్చరింగ్ రిలీఫ్ అందించడంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. దీని ద్వారా లోన్ రీకాస్ట్ కోసం అర్హులైన వారిని గుర్తించాలని చెప్పారు.
ప్రభుత్వాలు, కార్పొరేట్లు ఎక్స్‌పెండిచర్ పెంచడం చాలా ముఖ్యమని కుమార్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సిస్టమ్ లో పెట్టే డబ్బుతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లో ఇన్వెస్ట్‌మెంట్‌ను, కన్జంప్షన్ డిమాండ్‌ను పెంచవచ్చని చెప్పారు. డైరెక్ట్‌గా ప్రజల అకౌంట్లలోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడం ద్వారా ప్రజల చేతిలో నగదును పెంచవచ్చని, ఇది రూరల్ డిమాండ్ పెరగడానికి సాయం చేస్తుందని రజ్‌నీష్ కుమార్ తెలిపారు. మధ్య తరగతి ప్రజలు ఎకానమీ రికవరీలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. పలు రకాలుగా వరుసగా ఐదో నెల కూడా లాక్‌డౌన్ కొనసాగుతోందన్నారు. వ్యాపారాల పునరుద్ధరణపై బ్యాంకర్లు దృష్టి సారించాలని చెప్పారు.