ఫిబ్రవరి  20 వరకే సీసీఐ కొనుగోళ్లు..ఏనుమాముల అగ్రికల్చర్‌‌ మార్కెట్‌ అధికారుల ప్రకటన

ఫిబ్రవరి  20 వరకే సీసీఐ కొనుగోళ్లు..ఏనుమాముల అగ్రికల్చర్‌‌ మార్కెట్‌ అధికారుల ప్రకటన

వరంగల్‌‌ సిటీ, వెలుగు : వరంగల్‌‌ ఏనుమాముల అగ్రికల్చర్‌‌ మార్కెట్‌‌లో సీసీఐ (కాటన్‌‌ కార్పొరేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా) ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు ఈ నెల 20 వరకు నడుస్తాయని మార్కెట్‌‌ ఆఫీసర్లు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించి, తమ పత్తి ఉత్పత్తులను జిన్నింగ్‌‌ మిల్లులకు తీసుకువెళ్లాలని సూచించారు. 21 నుంచి సీసీఐ పత్తిని కొనుగోలు చేయదని స్పష్టం చేశారు.