హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ప్రాంగణంలోని శాసనమండలి భవనం పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ పనులను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఆర్ అండ్‌బీ అధికారులు, అగాఖాన్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు.
రానున్న మండలి సమావేశాలు ఇక్కడే జరిగేలా పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. పునర్నిర్మాణ పనులపై రేవంత్ ఆరా తీశారని, త్వరలోనే మండలి సమావేశాల హాల్‌ను ప్రారంభించనున్నట్లు గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడించారు. అందుకే సమావేశం హాల్ పనులను త్వరగా పూర్తి చేసి మండలికి అప్పగించాలని అధికారులకు స్పష్టం చేశారు.
