తెలంగాణ సర్కార్‌‌కు కౌంట్ డౌన్ స్టార్ట్

తెలంగాణ సర్కార్‌‌కు  కౌంట్ డౌన్ స్టార్ట్

తెలంగాణ ప్రభుత్వానికి కౌంట్‌‌‌‌డౌన్ స్టార్ట్ అయ్యిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్, బీఆర్ఎస్ లకు వీఆర్ఎస్ తప్పదని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని.. ఈ విషయంలో ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆ పార్టీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డాకు స్వాగతం పలికేందుకు బండి సంజయ్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. హైదరాబాద్ జరుగుతున్న వి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలే తప్ప టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ధర్నా కాదని అన్నారు. 

టీఆర్ఎస్ పాలనలో సామాన్యుడి పరిస్థితి అధ్వానంగా మారిందని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కరెంటు, నల్లా, బస్, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచి జనంపై భారం మోపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇటీవలే బీజేపీకి చెందిన కొందరు కార్పొరేటర్లు టీఆర్ఎస్ కండువా కప్పుకోవడంపై బండి సంజయ్ రెస్పాండ్ అయ్యారు. డబ్బులిచ్చి, మభ్య పెట్టి, బెదిరించి వారిని పార్టీలోకి తీసుకుంటున్నారని విమర్శించారు. ప్రెసిడెంట్ ఎలక్షన్స్పై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనన్న ఆయన..  రాష్ట్రపతి ఎన్నికల స్థాయిని సీఎం కేసిఆర్ దిగజారుస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఈ ఎన్నికలకు గల్లీ స్థాయి ఎన్నికలుగా చూడకుండా.. గౌరవంగా వ్యవహరించాలని సూచించారు.