ఉజ్జయిని ఆలయంలో హుండీల లెక్కింపు: రూ. 23 లక్షల ఆదాయం

ఉజ్జయిని ఆలయంలో హుండీల లెక్కింపు: రూ. 23 లక్షల ఆదాయం

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో 80 రోజులకు సంబంధించిన హుండీలను సోమవారం లెక్కించారు. నగదు రూపంలో రూ. 21,34,803, నాణేల రూపంలో రూ. 2,07,600 వచ్చి మొత్తం హుండీ ఆదాయం రూ. 23,42,403గా నమోదైంది. 

వీటితో పాటు భక్తులు 45 గ్రాముల 260 మిల్లీగ్రాముల బంగారం, 350 గ్రాముల వెండిని కానుకలుగా సమర్పించారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ శ్రీదేవి, ఈఓ మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.