ఈనెల 9న నేరేడ్ మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు

ఈనెల 9న నేరేడ్ మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు

హైదరాబాద్: పెండింగ్ లో ఉన్న నేరెడ్ మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపును ఈనెల 9వ తేదీన చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. బ్యాలెట్ పేపర్లపై స్వస్తిక్ గుర్తుకు బదులు ఇతర గుర్తులున్నా.. అంగీకరించాలన్న ఈసీ ఆదేశాల పై అభ్యంతరాలు చెలరేగిన విషయంలో అర్థరాత్రి ఈసీ ఆదేశాలపై హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ పూర్తి స్థాయి విచారణ  జరిగింది. ఈ నెల 9వ తేదీ  నెరేడ్ మెట్ డివిజన్ 136 కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని నిర్దేశించింది.  పక్కన పెట్టిన 544 ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్న హైకోర్టు…  కౌంటింగ్ సజావుగా సాగే  విధంగా చర్యలు చేపట్టాలని రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు జారీ చేసింది.

4వ తేదీన పాల్గొన్న కౌంటింగ్ సిబ్బందే హాజరు కావాలి-హైకోర్టు

స్వస్తిక్ గుర్తు లేని కారణంగా కోర్ట్ ఆదేశాల ప్రకారం నెరేడిమేట్ డివిజన్ లో నిలిచిపోయిన 544 బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ తిరిగి ఈనెల 9 వ తేదీ ఉదయం 8 గంటలకు తిరిగి ప్రారంభించడానికి కోర్ట్ అనుమతి ఇచ్చింది.

కౌంటింగ్ నిబంధనల ప్రకారం ఓట్ల లెక్కింపు జరిగాక ఫలితాన్ని కౌంటింగ్ ఆబ్జెర్వర్ ప్రకటిస్తారు.

4 వ తేదీన లెక్కింపు లో పాల్గొన్న అభ్యర్థులు, ఎలక్షన్ ఏజెంట్స్,కౌంటింగ్ ఏజెంట్స్ లకు 9 వ తేదీ లెక్కింపునకు సంబంధించిన వివరాలు అందించాలి.

జీహెచ్ఎంసీ సెక్షన్-65 యాక్ట్ ప్రకారం 4 వ తేదీన కౌంటింగ్ లో పాల్గొన్న రిటర్నింగ్ అధికారి మరియు కౌంటింగ్ సిబ్బందే ఇపుడు కూడా కౌంటింగ్ ప్రక్రియ కి హాజరు కావాలి.

4 వ తేదీన కౌంటింగ్ కు చేసిన ఏర్పాట్లు, నియమ నిబంధనలు ఇపుడు కూడా యధావిధిగా కొనసాగాలి.

హైకోర్టు ఆర్డర్ కాపీ ఇదే..