- అభ్యంతరకరంగా మాట్లాడాడని ఫైర్
- వికారాబాద్ జిల్లా పరిగిలో ఘటన
పరిగి, వెలుగు: వికారాబాద్‌జిల్లా పరిగి డిపో బస్‌డ్రైవర్‌పై భార్యాభర్తలు దాడి చేశారు. పరిగి బస్సు డిపోకు చెందిన డ్రైవర్మాల నర్సింహులు మంగళవారం మధ్యాహ్నం డ్యూటీ పూర్తి చేసుకుని పరిగి బస్టాండ్‌కు చేరుకున్నారు. అప్పుడే గడిసింగాపూర్ కు చెందిన నస్కంటి స్వాతి, ఈమె భర్త కుమార్.. నర్సింహులును బస్సు ఎక్కడికి పోతుందని అడిగారు. దీంతో ‘డిపోలోకి పోతుంది ’ అని హేళనగా సమాధానం చెప్పాడు.
అలాగే, స్వాతి గురించి అభ్యంతరకరంగా మాట్లాడాడని తెలిసింది. దీంతో అక్కడున్న వారి ముందు తమకు అవమానం జరిగిందని భార్యాభర్తలు భావించారు. వెంటనే నర్సింహులు బస్సును డిపోకు తీసుకువెళ్తుండగా ఖాళీ బస్సు ఎక్కారు. బస్సు ఎందుకు ఎక్కారని అడగ్గా...తమకు డిపోలో అందరూ తెలుసని, డిపోకు పోనివ్వాలని కోరారు.
ఈ విషయంలో ఇరు వర్గాల మధ్య వాదన మొదలైంది. ఇది మరింత ముదిరింది. చివరకు డిపోకు చేరుకున్నాక కుమార్బస్సు డ్రైవర్నర్సింహులు ముఖంపై కొట్టాడు. దీంతో అతడి పెదవి పగిలి రక్తం వచ్చింది. తర్వాత స్వాతి కూడా అతడి చెంపలపై కొట్టింది. దీనిపై నర్సింహులు పరిగి పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
