తండ్రిపై కూతురి పగనే ఈ పని చేసిందా..? తండ్రి అఫైర్.. అతని ఇంటికి కూతురు.. ఆ తర్వాత ఏమైందంటే..

తండ్రిపై కూతురి పగనే ఈ పని చేసిందా..? తండ్రి అఫైర్.. అతని ఇంటికి కూతురు.. ఆ తర్వాత ఏమైందంటే..

చెన్నె: తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో దారుణం జరిగింది. చెంగం సమీపంలోని ఒక గ్రామంలో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు గుడిసెకు బయటి నుంచి తాళం వేసి నిప్పంటించడంతో 53 ఏళ్ల వ్యక్తి, అతనితో సహ జీవనంలో ఉన్న మహిళ సజీవ దహనమయ్యారు. చెంగం సమీపంలోని పక్కిరిపాళయం గ్రామానికి చెందిన రైతు పి. శక్తివేల్, ఎస్. అమృతం (40) అనే మహిళగా పోలీసులు గుర్తించారు.

పక్కిరిపాళయం దగ్గర ఒక గుడిసె పూర్తిగా కాలిపోయిందని పోలీసులకు సమాచారం అందిందని చెంగం ఇన్‌స్పెక్టర్ ఎం. సెల్వరాజ్ మీడియాకు వెల్లడించారు. స్పాట్కు చేరుకున్న పోలీసులు గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన రెండు మృతదేహాలను గుర్తించారు. ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాల కోసం సంఘటనా స్థలాన్ని జల్లెడ పట్టింది. స్నిఫర్ డాగ్‌ను రంగంలోకి దించారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి శరీర భాగాలు మిగలకపోవడంతో సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించారు.

శక్తివేల్ తన భార్య ఎస్ తమిళరసి నుంచి మూడేళ్ల క్రితం విడిపోయాడని ప్రాథమిక విచారణలో తేలిందని చెంగం ఇన్‌స్పెక్టర్ సెల్వరాజ్ చెప్పారు. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అతని భార్య ఇప్పుడు పిల్లలతో కలిసి బెంగళూరులో ఉంటోంది. సెల్వరాజ్ మూడు సంవత్సరాల నుంచి అమృతంతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.

►ALSO READ | ఛత్తీస్గడ్ బస్తర్లో భారీ ఎన్‌కౌంటర్‌.. 14 మంది మావోయిస్టులు మృతి

అమృతం కూడా తన భర్త నుంచి విడిపోయింది. సెల్వరాజ్ కుమార్తె గురువారం రాత్రి అమృతంతో తన తండ్రి ఉంటున్న ఇంటికి వెళ్లి.. తన తండ్రిని చూసి.. రాత్రి 9 గంటల సమయంలో భోజనం చేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత కొంత సమయానికి శక్తివేల్, అమృతం నిద్రిస్తున్న సమయంలో గుడిసె కాలిపోయింది. సెల్వరాజ్ కూతురిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.