మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా నాగోల్ లో విషాదం చోటుచేసుకుంది. తట్టియన్నారం శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు దంపతులు. కొత్తపేటకు చెందిన భార్యా భర్తలు మల్లేష్(45) ,సంతోషి(37) గుర్తించారు పోలీసులు.
చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో నవంబర్ 21న ఉదయం తన తల్లిదండ్రులు కనిపించడం లేదని కుమారుడు కంప్లైంట్ ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దంపతుల సెల్ సిగ్నల్ ఆధారంగా నాగోల్ తట్టియన్నారం శివారులో భార్యభర్తల ఆచూకీ కనుగొన్నారు. అయితే స్పాట్ లో భార్య సంతోషి మృతి చెందగా.. భర్త మల్లేష్ ను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలు్తోంది. అప్పుల బాధలే ఆత్మహత్యలకు కారణం అని పోలీసులకు పిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు.
