హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఈ నెల 21, 22 తేదీల్లో సిటీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాష్ట్రపతి నిలయం, రాజ్‌భవన్ రూట్లో వీవీఐపీ/వీఐపీల కదలికల కారణంగా సికింద్రాబాద్, తిరుమలగిరి, బేగంపేట ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు.
ఈ క్రమంలో ఇవాళ-ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు సీటీవో జంక్షన్, రసూల్‌పుర, పీఎన్టీ జంక్షన్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట ఫ్లైఓవర్, గ్రీన్‌ల్యాండ్స్, పంజాగుట్ట జంక్షన్, మొనప్ప జంక్షన్, యషోద హాస్పిటల్, కట్రియా హోటల్, మెట్రో రెసిడెన్సీ, వీవీ స్టాట్యూ, రాజ్‌భవన్ వద్ద ట్రాఫిక్ ఆపేయవచ్చు లేదా డైవర్ట్ చేయవచ్చని పేర్కొన్నారు.
అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు రాజ్ భవన్, వీవీ స్టాట్యూ, మెట్రో రెసిడెన్సీ, కట్రియా, యషోద మొనప్ప , పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట్ ఫ్లైఓవర్, పీఎన్టీ, రసూల్‌పుర, టీవోలీ ఎన్సీసీ, క్లబ్-ఇన్ గేట్, ఏర్టెల్ జంక్షన్ , కార్ఖానా, ఆర్టీఏ తిరుమలగిరి, తిరుమలగిరి క్రాస్ రోడ్ హోలీ ఫ్యామిలీ, లాల్ బజార్ , ఎంసీఈఎంఈ , లోతుకుంట, సత్య పెట్రోల్ పంప్, అల్వాల్ టీ జంక్షన్ , ఏఓసీ సెంటర్ , బైసన్ సిగ్నల్ రూట్లలో ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుందన్నారు.
సాయంత్రం 5:30 నుంచి రాత్రి 6:45 వరకు బైసన్ సిగ్నల్ నుంచి పై రూట్లోనే తిరిగి రాజ్‌భవన్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వివరించారు. 22న ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు రాజ్‌భవన్, వీవీ స్టాట్యూ, మెట్రో రెసిడెన్సీ, కట్రియా, యషోద, మొనప్ప, పంజాగుట్ట, గ్రీన్‌ల్యాండ్స్, బేగంపేట ఫ్లైఓవర్, రసూల్‌పుర, సీటీవో వరకు ఆంక్షలు ఉంటాయిని, ఈ సమయంలో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు. ట్రాఫిక్ సమాచారం కోసం హెల్లైన్ నంబర్ 9010203626కు సంప్రదించవచ్చని సూచించారు.
