ఆబ్సెంట్ తోనే 150 మస్టర్ల సర్క్యులర్ జారీ..గేట్ మీటింగ్ లో ఏఐటీయూసీ ప్రెసిడెంట్ వి.సీతారామయ్య

ఆబ్సెంట్ తోనే 150 మస్టర్ల  సర్క్యులర్ జారీ..గేట్ మీటింగ్ లో ఏఐటీయూసీ ప్రెసిడెంట్ వి.సీతారామయ్య

గోదావరిఖని, వెలుగు :  సింగరేణిలో 40 శాతం మంది కార్మికులు సరిగా విధులకు రాని కారణంగానే  మేనేజ్​మెంట్150 మస్టర్ల సర్క్యులర్​జారీ చేసిందని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రెసిడెంట్​వి.సీతారామయ్య తెలిపారు. కార్మికుల హాజరు శాతం తగ్గడంతో మెషీన్లు ఖాళీగా ఉండి బొగ్గు ఉత్పత్తిపై ఎఫెక్ట్ పడుతుందనే అలాంటి నిర్ణయం తీసుకుందని చెప్పారు. 

గురువారం జీడీకే –2 గనిపై జరిగిన గేట్​మీటింగ్​లో ఆయన మాట్లాడారు. డ్యూటీలకు రెగ్యులర్​గా హాజరయ్యే కార్మికులకు 150 మస్టర్ల సర్క్యులర్​నుంచి మినహాయింపు ఇవ్వాలని స్ట్రక్చర్డ్​ మీటింగ్ లో అధికారులకు సూచించినట్టు గుర్తుచేశారు. 

సొంతింటి స్కీమ్ అమలుపై కొన్ని కార్మిక సంఘాలు విమర్శలు చేస్తూ కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు.  కార్మికులకు అన్యాయం జరిగితే యూనియన్​చూస్తూ ఊరుకోదని పేర్కొన్నారు.