హోండా తన ఎస్యూవీ ఎలివేట్ ఏడీవీ ఎడిషన్‌ను తెలంగాణ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఐ-వీటెక్ ఇంజన్, కొత్త సేఫ్టీ ఫీచర్లు, గ్లాసీ బ్లాక్ ఆల్ఫా- బోల్డ్ ప్లస్ ఫ్రంట్ గ్రిల్, నలుపు రంగు క్యాబిన్ వంటివి దీని ప్రత్యేకతలు. 1.5 లీటర్ ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారుకు మాన్యువల్, సీవీటీ ట్రాన్స్మిషన్ ఆప్షన్లు ఉంటాయి. ధర రూ. 15.29 లక్షల నుంచి మొదలవుతుంది.
