IND A vs BAN A: సెమీస్లో బంగ్లా మిస్టేక్తో థ్రిల్లింగ్ సూపర్ ఓవర్.. మంచి చాన్స్ చేతులారా మిస్ చేసుకున్న ఇండియా-A

IND A vs BAN A: సెమీస్లో బంగ్లా మిస్టేక్తో థ్రిల్లింగ్ సూపర్ ఓవర్.. మంచి చాన్స్ చేతులారా మిస్ చేసుకున్న ఇండియా-A

క్రికెట్ లో సూపర్ ఓవర్ అంటే ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటుంది. అందులో ప్రత్యర్థి జట్టు మిస్టేక్ కారణంగా సూపర్ ఓవర్ ఛాన్స్ రావడం.. ఫైనల్ ఆశలు ఆవిరై పోయాయి అనుకునే టైమ్ లో సూపర్ ఓవర్ కు దారితీయడం.. మామూలుగా ఉండదు. కానీ సూపర్ ఓవర్ ను సరిగ్గా ఉపయోగించుకుని బ్యా్ట్ తో మెరుపులు మెరిపిస్తేనే తప్ప అభిమానులకు థ్రిల్ ఉండదు. ఇండియా ఎ వర్సెస్ బంగ్లాదేశ్ ఎ మధ్య జరిగిన సూపర్ ఓవర్ కూడా అలాంటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించింది. 

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2025 సెమీస్  లాస్ట్ బాల్ థ్రిల్లర్ లా మిగిలింది. 195 రన్స్ చేజ్ చేసే క్రమంలో లాస్ట్ బాల్ కు 4 రన్స్ చేయాల్సి ఉండగా.. మూడు రన్స్ తీయటంతో సూపర్ ఓవర్ వచ్చింది. 

చివరి ఓవర్ లో IND A 16 రన్స్ కొట్టాల్సి ఉంది. అశుతోష్ శర్మ అద్భుతమైన సిక్స్ తో ఈక్వేషనన్ 3 బాల్స్ లలో 8 రన్స్ కొట్టేవరకు వచ్చింది. బంగ్లా చెత్త ఫీల్డింగ్ కారణంగా.. 2 బాల్స్ లో 4 రన్స్ కొట్టే వరకు వచ్చింది మ్యాచ్. ఆ బాల్ కు అశుతోష్ శర్మ క్లీన్ బౌల్డ్ కావడంతో ఇండియా చాన్సెస్ దాదాపు పోయినట్లే అనుకున్నారు. ఫైలన్ బాల్ ఫేస్ చేసిన హర్ష్ దుబే..స్ట్రైట్ లాంగ్ పంపించి సింగ్ల తీసుకున్నారు. 

అయితే ఇక్కడ ఓడిపోయే మ్యాచ్ బంగ్లా ప్లేయర్ల కారణంగా ఫుల్ జోష్ కు వచ్చింది. బంగ్లా కీపర్ చేసన తప్పిదాల కారణంగా.. డ్రా చేసుకున్నారు. రనౌట్ చేయబోయి మిస్ చేయడంతో.. ఓవర్ థ్రో కారణంగా మరో రన్ వచ్చింది. సో దీంతో సూపర్ ఓవర్ తప్పని పరిస్థితి అయ్యింది. 

చేజేతులా పోగొట్టుకున్న టీమిండియా?

ఇంత మంచి ఆఫర్ ఎవరికీ రాదేమో. ఎందుకంటే.. ఓడిపోతాం అనుకున్న మ్యాచ్ గెలిచే అవకాశాన్ని కల్పించడం. కానీ బాల్ ను థర్డ్ మ్యాన్ సైడు పంపించే క్రమంలో.. కెప్టెన్ జితేష్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాతి బాల్ కే అశుతోష్ శర్మ కూడా ఔటయ్యాడు. దీంతో బంగ్లాదేశ్ ముందు కేవలం 1 రన్ టార్గెట్ మాత్రమే ఉండిపోయింది. 

సూపర్ ఓవర్ ను సుయాష్ శర్మ బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్ వై యాసిర్ అలి ప్రారంభించగా... డకౌట్ అవటంతో మరింత డ్రామా నెలకొంది. చివరికి బంగ్లా ఎట్టకేలకు గెలిచి ఫైనల్ కు వెళ్లింది.