TATA WPL 2026: ప్లేయర్స్ వేలం లిస్టు విడుదల.. 73 స్థానాల కోసం 277 మంది పోటీ !

TATA WPL 2026: ప్లేయర్స్ వేలం లిస్టు విడుదల.. 73 స్థానాల కోసం 277 మంది పోటీ !

విమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 కోసం రంగం సిద్ధమైంది. TATA WPL 2026 లో భాగంగా ప్లేయర్ల వేలం లిస్టును విడుదల చేసింది BCCI. మొత్తం 277 మంది ప్లేయర్స్ జాబితా విడుదలైంది. ఇందులో 73 స్థానాల కోసం ప్లేయర్స్ పోటీ పడనున్నారు. 

 TATA WPL వేలం  2025 నవంబర్ 27న, న్యూఢిల్లీలో నిర్వహించబడుతుంది. వేలం పట్టిక లో 194 మంది భారత ప్లేయర్స్ ఉన్నారు. వీరిలో 52 మంది క్యాప్డ్ ప్లేయర్స్ ఉండగా, 142 మంది అన్‌ క్యాప్డ్ ప్లేయర్స్ ఉన్నారు. క్యాప్ డ్ ప్లేయర్స్ అంటే నేషనల్ టీమ్ కు ఏదో ఒక ఫార్మాట్ లో ఆడిన వారు. 50 స్థానాల కోసం హ్యామర్ కిందకు రానున్నారు. 

అలాగే 66 మంది విదేశీ క్యాప్డ్ ఆటగాళ్లు, 17 మంది విదేశీ అన్‌ క్యాప్డ్ ప్లేయర్స్ కలిసి మొత్తం 23 స్థానాల కోసం పోటీ పడనున్నారు. మొత్తం 277 మంది నమోదు చేసిన ఆటగాళ్ల వివరాలు విడుదలయ్యాయి. వాళ్ల బేస్ ప్రైస్ తో పాటు ప్లేయర్స్ లిస్టును విడుదల చేసింది. 

ఈ లిస్టులో 2025 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన దీప్తి శర్మ, రేణుక సింగ్ ఠాకూర్ వంటి స్టార్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. అయితే19 మంది ఆటగాళ్లు అత్యధిక బేస్ ప్రైస్ రూ. 50 లక్షలలో నమోదు చేసుకోగా, 11 మంది ఆటగాళ్లు రూ. 40 లక్షలు, 88 మంది ఆటగాళ్లు రూ. 30 లక్షల బ్రాకెట్‌లో నమోదు చేసుకున్నారు.

 అయితే వేలంలో మొదటగా మార్క్యూ ఆటగాళ్లు బిడ్‌లోకి రానున్నారు. వీరిలో ఎనిమిది మంది పేర్లు ఉన్నాయి. దీప్తి శర్మ, అలిస్సా హీలీ, లారా వోల్వార్డ్ట్, మెగ్ లాన్నింగ్, రేణుకా సింగ్, సోఫీ ఎక్లెస్టోన్, అమేలీ కేర్, సోఫీ డివైన్  రూ.5 కోట్ల బేస్ ధరతో ఉన్నారు. ఇక వోల్వార్డ్ట్ 3 కోట్లు, రేణుక  4 కోట్ల బేస్ ప్రైస్ లో ఉన్నారు.