జడ్చర్ల, వెలుగు: జడ్చర్ల పట్టణంలో దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పట్టణంలోని క్లబ్ రోడ్డులో నివాసముంటున్న ఆకుతోట శేఖర్(52), వరాలు(42) దంపతులు శనివారం తమ ఇంట్లోనే పడుకున్న చోట మృతిచెందారు. శేఖర్ బియ్యం వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడని, చీటీల వ్యాపారం కూడా నిర్వహించేవాడని కాలనీ వాసులు తెలిపారు. ఇటీవల వరాలు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
