ప్రభుత్వం ఇచ్చిన భూమిలో  ట్రెంచ్‌ కొట్టిన్రు

ప్రభుత్వం ఇచ్చిన భూమిలో  ట్రెంచ్‌ కొట్టిన్రు

ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ట్రెంచ్‌ కొడతమని ఫారెస్ట్‌ ఆఫీసర్లు బెదిరిస్తున్నరని.. డబ్బులిస్తేనే భూమి దక్కుతుందని బెదిరిస్తున్నరని భార్యభర్తలు కలెక్టర్‌ ముందే ఆత్మహత్య చేసుకుంటని పెట్రోల్‌ పోసుకున్నరు.  మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం జగ్నాతండాకు చెందిన భూక్య కాశీరాం, సుభద్రలు సీపీఐ(ఎంఎల్​)ప్రజాప్రతినఘటన పార్టీ సాయుధ దళంలో చేరి ఐదేళ్లు అజ్ఞాత జీవితం గడిపారు. ఏడేళ్ల క్రితం ప్రభుత్వ పిలుపుతో ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిశారు. పునరావాసం కింద ప్రభుత్వం వారికి 202, 204 సర్వేనెంబర్లలో 10ఎకరాలు ఇచ్చింది. అందులో 202సర్వేనెంబరులో 4.20ఎకరాల భూమికి సుభద్ర పేరా పట్టా కూడా ఇచ్చారు.  అయితే కొద్దిరోజుల క్రితం ఎఫ్‌ఆర్వో కర్ణావత్ వెంకన్న వచ్చి ఇది ఫారెస్ట్‌ భూమి అని ట్రంచ్​ తీస్తామని చెప్పారు. ఆఫీసుకు వెళ్లి అడిగితే తరువాత మాట్లాడదామన్నారు. మూడు రోజుల తరువాత ఇతర రైతులతో పాటు మీరు లక్షల రూపాయలివ్వండి డిమాండ్ చేశారన్నారు. లంచం ఇవ్వమని చెప్పడంతో మా భూమిలో ట్రెంచ్ తీశాడన్నారు. ఇది ఫారెస్టు భూమి కాదని, తహసీల్దార్​ 2018లో ఇచ్చిన నివేధికను చూపించాను. అయితే రూ.50వేలు ఇచ్చి ట్రాంచ్​ను మీరే పూడ్చికోవాలని చెప్పారు. దీనిపై ఆర్డీవో, జేసీలకు ఫిర్యాదు చేశామన్నారు. సర్వే చేయాల్సిందిగా తహసీల్దార్‌ను కోరితే చెప్తే రేపూమాపు అంటు దాటవేస్తున్నాడన్నారు. ఎఫ్ఆర్వో వెంకన్న, తహసీల్దార్ అవినీతితో తీవ్రంగా నష్టపోతున్నామన్నారు.  వారిపై చర్యలు తీసుకోవాలని లేదంటే ఆత్మహత్యే శరణ్యమని సోమవారం గ్రీవెన్స్‌ సందర్భంగా కలెక్టర్​ ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయాత్నం చేశారు. పోలీసులు వెంటనే వారిని అరెస్టు చేసి దవాఖానకు తరలించారు.