వివేకా హత్య కేసుపై కోర్టు సంచలన ఆదేశాలు.. ప్రతిపక్షాలకు చెక్..

వివేకా హత్య కేసుపై కోర్టు సంచలన ఆదేశాలు.. ప్రతిపక్షాలకు చెక్..

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు కీలకంగా మారింది. ఈ కేసుపై ప్రతిపక్ష టీడీపీ, జనసేనతో పాటు జగన్ సోదరి షర్మిల, వివేకా కూతురు షర్మిల కూడా జగన్, అవినాష్ రెడ్డిలపై ప్రత్యక్షంగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ కేసు సీబీఐ విచారణలో ఉన్నపటికీ ప్రతిపక్షాలు జగన్ వర్గంపై ప్రత్యక్ష విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తూ జగన్ ను ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు.

వివేకా హత్య కేసుపై ప్రతిపక్షాల విమర్శల మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైసీపీ నేత సురేష్ బాబు కడప జిల్లా కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. వివేకా హత్య కేసులో జగన్, అవినాశ్ రెడ్డి పేర్లు ప్రస్తావిస్తూ మాట్లాడొద్దని కోర్టు ఆదేశించింది.ఎన్నికల వేళ రాజకీయ విమర్శల వల్ల జగన్, అవినాష్ లకు నష్టం కలుగుతుందన్న వాదనతో ఏకీభవించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల, వివేకా కుమార్తె సునీతలకు ఈ ఆదేశాలు జారీ చేసింది కోర్టు.