రవిప్రకాశ్ కు బెయిల్ ఇవ్వండి: హైకోర్టు

రవిప్రకాశ్ కు బెయిల్ ఇవ్వండి:  హైకోర్టు
  • కూకట్ పల్లి మెజిస్ట్రేట్ కు హైకోర్టు ఆదేశం
  • తప్పుడు ఈమెయిల్ కేసులోనూ టీవీ 9 మాజీ సీఈవోకు ఊరట    

హైదరాబాద్‌‌, వెలుగు: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కు మరోసారి హైకోర్టులో ఊరట లభించింది. తప్పుడు ఈ మెయిల్‌‌ క్రియేట్‌‌ చేశారనే కేసులో రవిప్రకాశ్ కు బెయిల్‌‌ ఇవ్వాలని కూకట్‌‌పల్లి మేజిస్ట్రేట్‌‌ను హైకోర్టు జడ్జి జస్టిస్ గండికోట శ్రీదేవి శుక్రవారం ఆదేశించారు. ఒక కేసులో బెయిల్‌‌ వస్తే, మళ్లీ ఇంకో కేసులో అరెస్ట్‌‌ చేస్తున్నారని, అన్ని కేసుల్లోనూ అరెస్ట్‌‌ చూపడం లేదని రవిప్రకాశ్​ లాయర్‌‌ వాదించారు. దీంతో ఆయా కేసుల్లో పోలీసుల దర్యాప్తుపై స్టే ఆర్డర్స్‌‌ అమల్లో ఉంటాయని, రూ.15 వేల పూచీకత్తులతోపాటు అంతే విలువైన మరో రెండు పూచీకత్తులు సమర్పించాక బెయిల్‌‌ ఇవ్వాలని మెజిస్ట్రేట్‌‌ను జస్టిస్ శ్రీదేవి ఆదేశించారు. విచారణను నవంబర్‌‌ 4కు వాయిదా వేశారు.