మద్యం తాగేందుకు మరో పబ్బుకు వెళ్తుండగా ప్రమాదం

మద్యం తాగేందుకు మరో పబ్బుకు వెళ్తుండగా ప్రమాదం

బంజారా హిల్స్ ఆక్సిడెంట్ కేసు లో ఇద్దరినీ అరెస్ట్ చేశామన్నారు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్. ప్రమాదం జరగగానే పారిపోయేందుకు రోహిత్ ప్రయత్నించాడన్నారు. నైట్ డ్యూటీ లో ఉన్న హరీష్వర్, జితేందర్ అనే పోలీస్ సిబ్బంది రోహిత్ కార్ ను వెంబడించారని పేర్కొన్నారు. ఒక్క అపార్ట్మెంట్ దగ్గర కారును పార్క్ చేసేందుకు రోహిత్ ప్రయత్నించాడన్నారు. దీంతో రోహిత్ ను పట్టుకున్న సిబ్బంది వెంటనే డ్రంకన్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారన్నారు. దానిలో 70 mg వచ్చిందన్నారు సీపీ. బర్త్ డే పార్టీ కోసం మాదాపూర్ లో ఉన్న ఆలివ్ బిస్ట్రో పబ్ కు నిందితులు వెళ్లారని అంజనీ కుమార్ తెలిపారు. అక్కడి నుండి ఫాట్ పిజియాన్  పబ్ కు వెళ్లారన్నారు. అక్కడి నుండి మద్యం తాగేందుకు నిందితులు ర్యాడిసన్ బ్లూ పబ్ కు వెళ్లారని తెలిపారు. తిరిగి మద్యం సేవించేందుకు పార్క్ హయత్ కు వెళ్ళలనుకున్న  క్రమంలో రోహిత్ ఈ కారు ప్రమాదం చేసినట్లు తెలిపారు. 

పార్క్ హయత్ కు వెళ్ళే సమయం లోనే రోడ్డు దాటుతున్న ఇద్దర్ని ఢీకొనడంతో వారు చనిపోయినట్లు  సీపీ తెలిపారు. సీసీ టీవీ కెమెరాల సాయంతోనే రోడ్డు ప్రమాదం చేసిన నిందితులను గుర్తించామన్నారు. ఇద్దరు నిందితులు బజార్ రోహిత్ గౌడ్, వెదుల్లా సాయి సోమన్ రెడ్డిని అరెస్ట్ చేశామన్నారు సీపీ. ఇద్దరు నిందితుల పై  304, 109 ఐపీఎసి, 185 మోటార్ వెకిల్ యాక్ట్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. కారుతో పాటు రెండు మొబైల్స్ సీజ్ చేశామన్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రీమాండ్ కు తరలించామని సీపీ తెలిపారు.