ఉత్తమ SIపై వేటు.. CP ఆఫీస్ కు అటాచ్

ఉత్తమ SIపై వేటు.. CP ఆఫీస్ కు అటాచ్

గురునాథ్ రెడ్డి

విధినిర్వహణలో నిర్లక్ష్యం  వహిస్తున్న నారాయణగూడ పోలిస్టేషన్ SI పై చర్యలు తీసుకున్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్. గురునాథ్ రెడ్డి నారాయణ గూడ పోలిస్టేషన్ లో SIగా పని చేస్తున్నారు.  ప్రజలు తమ పిర్యాదులు ఇవ్వడానికి వచ్చినపుడు గురునాధ్ రెడ్డి వారితో మర్యాదగా ప్రవర్తించడం లేదని తెలిసినందున చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు అంజనీకుమార్. అయితే.. ఇదే  గురునాథ్ రెడ్డి ఈ నెలలోనే ఉత్తమ సేవలకు గాను డీజీపీ మహేందర్ రెడ్డి చేతులమీదుగా ఉత్తమసేవ కు గాను  రివార్డును తీసుకున్నాడు. 

వినోద్

మరో SI వినోద్ ను కూడా సీపీకి ఎటాచ్ చేశారు అంజనీ కుమార్. వినోద్ మసాజ్ సెంటర్లకు సహకరిస్తున్నారన్న నేపథ్యంలో చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.