పిల్లలను పనిలో పెట్టుకుంటే.. ఓనర్లపై కేసులు

పిల్లలను పనిలో పెట్టుకుంటే.. ఓనర్లపై కేసులు
  • రాచకొండ సీపీ​ చౌహాన్ హెచ్చరిక​

నేరెడ్​మెట్, వెలుగు: తప్పిపోయిన చిన్నారులను 'ఆపరేషన్​ ముస్కాన్​' ద్వారా గుర్తిస్తున్నామని  రాచకొండ సీపీ డీఎస్​ చౌహాన్​ తెలిపారు. నేరెడ్​మెట్​లోని సీపీ ఆఫీస్​లో బుధవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బడికి వెళ్లాల్సిన పిల్లలను అక్రమంగా రవాణా చేసి కార్మికులుగా మార్చే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్పెషల్​ టీమ్​తో పాటు మఫ్టీలో  సైతం ప్రత్యేక టీమ్‌‌‌‌లు మిస్సింగ్ చిన్నారులను గుర్తించే పనిలో ఉంటాయని పేర్కొన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాల్లో పిల్లలను పనిలో పెట్టు
కుంటే ఓనర్లపై కేసులు పెడతామని  హెచ్చరించారు. గుర్తించిన  పిల్లలను 24 గంటల్లో  చైల్డ్ వెల్ఫేర్ కమిటీలకు అప్పగిస్తామన్నారు.

 అనంతరం తప్పిపోయిన పిల్లల ఆచూకీ తెలుసుకునేలా  ‘దర్పణ్’ మొబైల్ అప్లికేషన్ ​వివరాలపై శిక్షణ ఇచ్చారు. అంతకుముందు బాలకార్మికుల పోస్టర్​ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ సత్యనారాయణ , షీ టీమ్స్ ఏసీపీ వెంకట్ రెడ్డి, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సీఐ చంద్రబాబు, రంగారెడ్డి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ నరేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ రాజారెడ్డి, యాదాద్రి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ జయశ్రీ పాల్గొన్నారు.