వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేస్తున్నట్లు ఫేక్ పోస్ట్... సీపీ సజ్జనార్ క్లారిటీ

వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేస్తున్నట్లు ఫేక్ పోస్ట్... సీపీ సజ్జనార్ క్లారిటీ

హైదరాబాద్: తాను వాట్సాప్ కాల్స్ రికార్డు చేస్తున్నట్టు, ప్రతి పోస్టునూ పర్యవేక్షిస్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంపై సీపీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. ఆ పోస్టు తాము పెట్టలేదని వెల్లడిం చారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. రేపటి నుంచి కొత్త వాట్సాప్, ఫోన్ కాల్ నియమాలు అమలు చేయబడుతు న్నాయని సీపీ సజ్జనార్ ఫోటో ఉప యోగించి తెలంగాణ పోలీస్, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ పేరుతో పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతోంది. 

అన్ని కాల్స్ రికార్డు, సేవ్ చేయబడతాయని, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ (ఎక్స్) అన్ని షోషల్ మీడియాలు పర్యవేక్షిం చబడతాయని ప్రచారం జరిగింది. 

అలాగే మీ ఫోన్ మంత్రిత్వ శాఖ వ్యవస్థకు కనెక్ట్ చేయబడుతుందని పోస్టర్లో తప్పుడు ప్రచారాన్ని వ్యక్తి చేశారు. దీంతో ఈ పోస్టర్ వివిధ సామాజిక మాధ్య మాల్లో వైరల్ గా మారింది. ఈ పోస్టు సృష్టించిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.