ఎయిర్ పోర్ట్ పీఎస్ లో సీపీ తనిఖీ.. పెండింగ్ ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశం

ఎయిర్ పోర్ట్ పీఎస్ లో  సీపీ తనిఖీ.. పెండింగ్ ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశం

హైదరాబాద్ సిటీ, వెలుగు: శంషాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎయిర్​పోర్టులోని పోలీస్ అవుట్​పోస్ట్​ను హైదరాబాద్ సీపీ సజ్జనార్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, పెండింగ్ ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యంగా డ్రగ్స్ అక్రమ రవాణా నివారణకు గూఢచారి వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికుల కోసం ప్రత్యేక ‘పోలీస్ హెల్ప్ డెస్క్’ ఏర్పాటు చేయాలని సూచించారు.