‘సేఫ్టీ క్లబ్స్’ బ్రోచర్ రిలీజ్ చేసిన సీపీ స్టీఫెన్ రవీంద్ర

‘సేఫ్టీ క్లబ్స్’ బ్రోచర్ రిలీజ్ చేసిన సీపీ స్టీఫెన్ రవీంద్ర

గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో స్టూడెంట్ల కోసం ‘సేఫ్టీ క్లబ్స్’ను ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. సైబారాబాద్ పోలీస్, ఎస్సీఎస్సీ(సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్) ఆధ్వర్యంలో ‘సేఫ్టీ ఫస్ట్.. సేఫ్టీ ఆల్వేస్’ ట్యాగ్ లైన్​తో ఏర్పాటుకానున్న ఈ సేఫ్టీ క్లబ్స్​కు సంబంధించిన లోగో, బ్రోచర్​ను  బుధవారం గచ్చిబౌలిలోని టీసీఎస్ పార్కు ఆడిటోరియంలో సీపీ రవీంద్ర లాంచ్ చేశారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ.. సేఫ్టీ క్లబ్స్​లో ఉండే బాలమిత్రలు స్టూడెంట్ల మాటలను శ్రద్ధగా విని, వారి అభిప్రాయాలను తెలుసుకోవాలన్నారు. ఏదైనా సంఘటన గురించి పిల్లలు చెబితే ఆ విషయం గురించి మాట్లాడేలా వారికి స్వేచ్ఛనివ్వాలని పేర్కొన్నారు. 

మాదాపూర్​ డీసీపీ శిల్పవల్లి మాట్లాడుతూ.. ఈ సేఫ్టీ క్లబ్స్​కు ఫిజికల్​సేఫ్టీ, సైబర్ ​సేఫ్టీ, యాంటీ డ్రగ్​అబ్యూజ్​ అండ్​ మెంటల్ ​హెల్త్ ​నాలుగు పిల్లర్లుగా ఉంటాయని, ప్రతి స్కూల్​లోని బాలమిత్ర టీచర్​ వీటి గురించి నెలకోసారి స్టూడెంట్లకు వివరించాలని పేర్కొన్నారు.  కార్యక్రమంలో ఎస్సీఎస్సీ జనరల్​ సెక్రటరీ కృష్ణ , టీసీఎస్​ జీఎం రాజు, సంగమిత్ర స్కూల్​ ఫౌండర్​ అనురాధ, స్కూల్​ ప్రిన్సిపల్స్​, టీచర్లు పాల్గొన్నారు.