ఉప్పల్ పోలీసుల తీరుపై సీపీ సీరియస్.. దాడి కేసులో కాంగ్రెస్ లీడర్ కు సపోర్ట్ చేశారని ఆరోపణలు

ఉప్పల్ పోలీసుల తీరుపై సీపీ సీరియస్.. దాడి కేసులో కాంగ్రెస్ లీడర్ కు సపోర్ట్ చేశారని ఆరోపణలు
  • పీఎస్​లో దంపతులతో కాళ్లు మొక్కించారని సమాచారం  
  • విచారణకు ఆదేశం త్వరలోనే యాక్షన్​

ఉప్పల్​, వెలుగు : పిల్లలు ఇంటి ముందు క్రికెట్​ఆడారనే కోపంతో స్థానిక కాంగ్రెస్​పార్టీ లీడర్​ఒకరు బూతులు తిడుతూ బిహార్​కు చెందిన దంపతులపై దాడికి పాల్పడగా, ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యం వారి మెడకు చుట్టుకునేలా ఉంది. కొద్ది రోజుల కింద ఉప్పల్​లక్ష్మీనారాయణ కాలనీలో ఓ కాంగ్రెస్​నేత ఇంటి ఎదుట రాత్రి వేళలో పిల్లలు క్రికెట్​ఆడుతున్నారని తిట్ల దండకం అందుకున్నాడు. అడ్డువచ్చిన తల్లిదండ్రులను కూడా వదల్లేదు. 

బిహార్​కు చెందిన దంపతులను బూతులు తిడుతూ దాడి చేశాడు. మహిళ అని కూడా చూడకుండా అసభ్యంగా ప్రవర్తించాడు. దీన్నంతా వీడియో తీస్తున్నాం అని చెప్పినా లెక్క చేయలేదు. పైగా కొట్టి ఫోన్​ను విసిరేశాడు. దాడిలో ఒకరికి గాయాలు కాగా, వారు ఫిర్యాదు చేయడానికి ఉప్పల్​పీఎస్​కు వెళ్లారు . కానీ, కేసు నమోదు చేసి దర్యాప్తు చేయకుండా, జీడీ ఎంట్రీ పెట్టి కాంగ్రెస్ నేతకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో అతడు వచ్చి తనపైనే దాడి చేశారని, తన ఉంగరం కూడా పోయిందని ప్రతి ఫిర్యాదు ఇచ్చాడు.

 కేసు రివర్స్ తిప్పడం, పోలీసులు కాంగ్రెస్​నేతకు సహకరిస్తుండడంతో బాధితులు మిన్నకుండిపోయారు. అక్కడే సదరు కాంగ్రెస్​నేత కాళ్లు మొక్కి కేసు వాపస్​తీసుకుని ఇంటికి వచ్చారు. ఇందులో ఉప్పల్​పోలీసుల ప్రమేయం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయం బీజేపీ, బీఆర్ ఎస్​నేతలకు తెలియడంతో  వారు సీపీ దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే, ఈ ఘటనలో పోలీసుల తీరుపై  మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో సీపీ సుమతి సీరియస్​అయి విచారణకు ఆదేశించినట్టు సమాచారం. త్వరలోనే సంబంధిత పోలీసులపై యాక్షన్​తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.