V6 News

డ్రగ్స్ నుంచి యూత్ ను కాపాడుకోవాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

డ్రగ్స్ నుంచి యూత్ ను కాపాడుకోవాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

హనుమకొండ/ తాడ్వాయి, వెలుగు: యువత డ్రగ్స్‌‌‌‌‌‌‌‌కు బానిసలుగా మారకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. మంగళవారం వరంగల్ కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్​లో మంత్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా విద్యాసంస్థలకు వంద మీటర్ల పరిధిలోని ఎలాంటి పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిర్ణీత సమయాల్లోనే షాపులు మూసేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

పెట్రోల్, డీజిల్ కొరతపై తప్పుడు ప్రచారం కారణంగా బంకుల వద్ద రద్దీని దృష్టిలో పెట్టుకుని  శాంతి భద్రత సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. అనంతరం పోలీస్ మత్తు పదార్థాల నియంత్రణతో పాటు, పోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు ఖరారు కావడంలో ప్రతిభ చూపిన పోలీస్ ఆఫీసర్లు, సిబ్బందికి సీపీ చేతుల మీదుగా నగదు రివార్డులతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. సమావేశంలో డీసీపీలు అంకిత్ కుమార్, రాజమహేంద్ర నాయక్, దార కవిత, ట్రైనీ ఐపీఎస్ మనీషా నెహ్రా తదితరులు పాల్గొన్నారు.