ఒక్క ఇంటర్వ్యూతో CPCB లో జాబ్.. జీతం రూ.42 వేలు

ఒక్క ఇంటర్వ్యూతో CPCB లో జాబ్.. జీతం రూ.42 వేలు

బెంగళూరులోని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(సీపీసీబీ) జూనియర్ రీసెర్చ్ ఫెలో, సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది.  ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 25. 
పోస్టులు: జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్) 02, సీనియర్ రీసెర్చ్ ఫెలో(ఎస్ఆర్ఎఫ్) 01. 
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బి.టెక్ లేదా బీఈ, ఎం.టెక్ లేదా ఎంఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
వయోపరిమితి: జూనియర్ రీసెర్చ్ ఫెలోకు 30 ఏండ్లు,  సీనియర్ రీసెర్చ్ ఫెలో(ఎస్ఆర్ఎఫ్)కు 32 ఏండ్లు మించకూడదు.   నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్లు ప్రారంభం: ఆగస్టు 08. 
లాస్ట్ డేట్: ఆగస్టు 25
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

ALSO READ : బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్ పోస్టులు..అర్హతలు ఇవే..