రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా లు : చాడ వెంకట్ రెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా లు : చాడ వెంకట్ రెడ్డి

కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం సమగ్ర సర్వే చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ లో సుమారుగా 2000 ఎకరాల వరకు ప్రభుత్వ భూములను ఆక్రమించారని తెలిపారు.

అర్హులైన వారికి పెన్షన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఈనెల 21న రాష్ట్రవ్యాప్తంగా అన్ని తహశీల్దార్ కార్యాలయాల ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నాలు చేపడుతామని చాడ వెంకటరెడ్డి చెప్పారు. దేశవ్యాప్తంగా ఈనెల 29న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.