ఖానాపూర్, వెలుగు : కార్మిక చట్టాల సవరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా ఉమ్మడి జిల్లా కార్యదర్శి నంది రామయ్య డిమాండ్ చేశారు.
గురువారం ఖానాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ సర్కారు పెట్టుబడిదారులకు అనుకూలంగా తీసుకొచ్చిన జీవో పట్ల కార్మికులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు కేంద్ర కార్మిక నూతన చట్టాలను అమలు చేయొద్దని సూచించారు. సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.
