హైదరాబాద్, వెలుగు: ఉపాధి హామీ పథకం పేరును రద్దుచేసి దాని స్థానంలో జీ రామ్ జీ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చి తూట్లు పొడిచేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని సీపీఐ నేత కె. నారాయణ విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రాలు 40% నిధులు ఖర్చు చేసేలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చి రాష్ట్రాలు భరించలేని విధంగా దానిని రూపొందించారని మండిపడ్డారు. రూ.28 లక్షల రూపాయలను సంపన్న కుటుంబాలకు పారుబకాయిల పేరుతో ఖర్చు చేశారని, పేదవారికి అన్యాయం చేస్తున్నారని తెలిపారు. పార్లమెంటులో బీజేపీ అనుకూల బిల్లులు పాస్ చేయించుకుంటున్నారని చెప్పారు.
