
న్యూఢిల్లీ, వెలుగు: వయస్సు రీత్యా పార్టీలో కీలక బాధ్యతల నుంచి తప్పుకున్నానని సీపీఐ నేత నారాయణ అన్నారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. చండీగఢ్‌లో జరిగిన పార్టీ జాతీయ మహాసభల్లో కీలక నిర్ణయాలు జరిగాయన్నారు. 75 ఏండ్లు నిండిన వాళ్లను రిలీవ్ కావాలని నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. ఈ నిర్ణయానికి కట్టుబడి నాయకత్వ బాధ్యతల స్థాయి నుంచి పదవీ విరమణ చేశానని చెప్పారు. పార్టీలో అంతర్గత సమస్యలు పరిష్కారం కోసమే ఇకపై పని చేయాల్సి ఉంటుందన్నారు.
సీపీఐ నేషనల్ సెక్రటరీ రాజాకు మాత్రం సడలింపు పొడిగిస్తూ జాతీయ మహాసభల్లో నిర్ణయం జరిగిందని వెల్లడించారు. మళ్లీ సీపీఐ నేషనల్ జనరల్ సెక్రటరీ రాజా కొనసాగుతారని వెల్లడించారు. పార్టీలో అంతర్గత సమస్యలు ఉత్పన్నమైనప్పుడు వాటిని సక్రమంగా పరిష్కరించే ప్రక్రియ కోసం కంట్రోల్ కమిషన్ ఉందన్నారు. పార్టీ కంట్రోల్ కమిషన్ చైర్మన్‌గా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ఆయన తెలిపారు.