ఏపీ నీళ్లు ఎత్కపోతుంటే.. ఏం చేశారు? : కూనంనేని సాంబశివరావు

ఏపీ నీళ్లు ఎత్కపోతుంటే.. ఏం చేశారు? : కూనంనేని సాంబశివరావు
  •     తప్పుల మీద తప్పులు చేసిన గత ప్రభుత్వం : ఎమ్మెల్యే కూనంనేని

హైదరాబాద్, వెలుగు :  పక్క రాష్ట్రం ఏపీ మనకు రావాల్సిన నీళ్లను పదేండ్లు ఎత్కపోతుంటే ఏం చేశారని బీఆర్​ఎస్ నేతలను సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. తప్పుల మీద తప్పులు చేసి నీళ్లు, నిధులు నియామకాలు అనే నినాదాన్ని నాటి బీఆర్ఎస్ సర్కారు మరిచిపోయిందని చెప్పారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. 

2014లోనే విభజన చట్టంలో  కృష్ణా, గోదావరి జలాల వివాదాల పరిష్కారానికి రివర్ బోర్డులను పెట్టినప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. ఏపీ వాళ్లు పోతిరెడ్డిపాడు నుంచి 94 వేల క్యూసెక్కులను జగన్ తీసుకుపోతే అప్పుడేం చేశారని నిలదీశారు. ప్రజలకు ఎందుకు చెప్పాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే కేసీఆర్ నీళ్లు, నియామకాల అంశం మరిచిపోయారని ఆరోపించారు.