‘మహిళా దర్బార్‌’ ఎందుకోసం : నారాయణ

‘మహిళా దర్బార్‌’ ఎందుకోసం :  నారాయణ

గవర్నర్ తమిళిసై రాజ్ భవన్ లో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 10న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట వరకు తమిళిసై రాజ్‌భవన్‌లో ‘మహిళా దర్బార్‌’ నిర్వహిస్తారని గవర్నర్‌ కార్యాలయం బుధవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో గవర్నర్ నిర్ణయంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. మహిళా దర్బార్ ఎందుకోసం పెడుతున్నారని ప్రశ్నించారు. ఇలాంటి రాజకీయ కార్యకలాపాలకు రాజ్ భవన్ ను ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారని నారాయణ ప్రశ్నించారు. 

రాష్ట్రంలో ఒకవైపు బీజేపీ రాజకీయ దాడి పెంచిందని, మరోవైపు గవర్నర్ పాత్ర అగ్గికీ అజ్యం పోస్తోందని నారాయణ ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై సీపీఐ విధానపరంగా పోరాడుతోందని అన్నారు. జుబ్లీహిల్స్ లో జరిగిన ఘటనలో మైనర్లను పబ్ లోకి అనుమతించడం చట్ట ప్రకారం నేరమన్నారు. ముందు పబ్ ను సీజ్ చేసి, యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ‘మహిళా ప్రజా దర్బార్’ విషయంలో గవర్నర్ పాత్ర రాజకీయపరంగా ఉందని ఆరోపించారు. వెంటనే ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని నారాయణ డిమాండ్ చేశారు.