తెలంగాణలో కాంగ్రెస్ కు అనుకూల పవనాలు వీస్తున్నాయి.. కల్వకుంట్ల కుటుంబానికి అహం పెరిగింది

తెలంగాణలో కాంగ్రెస్ కు అనుకూల పవనాలు వీస్తున్నాయి.. కల్వకుంట్ల కుటుంబానికి అహం పెరిగింది

తెలంగాణలో  కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయి అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. సీపీఐ కు బీజేపీ, బీఆర్ఎస్ తప్ప అన్నీ పార్టీలు సహకరిస్తున్నాయన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల జరిగిన ప్రతి డెవలప్‌మెంట్‌ లో కల్వకుంట్ల కుటుంబానికి షేర్‌లు లేకుండా లేవు.. తీగల బ్రిడ్జిలో  కూడా షేర్ కేసీఆర్ కుటుంబానికి షేర్ ఉందంటూ  సంచలన ఆరోపణలు చేశారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు.. అవినీతిని అయినా జనాలు ఒకానొక దశలో ఒప్పుకుంటారెమో.. కానీ, కల్వకుంట్ల కుటుంబానికి అహం పెరిగిపోయింది.. ఈ అహంతోనే ఈసారి అధికారం కోల్పోతున్నారు. ఈ అహనికి పునాదులు ఢిల్లీ లో ఉన్నాయి.. బీజేపీ అండ చూసుకుని బీఆర్ఎస్‌ ఇంతలా అహాన్ని ప్రదర్శిస్తోందని మండిపడ్డారు.

బీఆర్ఎస్ కు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని ఆయన అన్నారు.   తెలంగాణలో నిర్మించే ప్రతి ప్రాజెక్టులో కల్వకుంట్ల కుటుంబానికి షేర్ ఇవ్వాల్సిందేనని నారాయ మండిపడ్డారు.  కల్వకుంట్ల కుటుంబానికి షేర్ ఇవ్వకపోతే ప్రాజెక్టులు పూర్తి కావని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది నిజమే అయినప్పటికీ.. అనేక చోట్ల డ్యామేజ్‌ జరిగింది.. పిల్లర్లు డ్యామేజ్‌ అయ్యింది మొదటిసారి… గతంలో కట్టిన ప్రాజెక్ట్ ల్లో అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నప్పటికీ పిల్లర్లు దెబ్బ తినడం ఏంటీ అసలు? ఇసుకపై కట్టడం ఏమిటీ? అని ప్రశ్నించారు. 15 ఎకరాలతో ఫామ్ హౌస్ కట్టుకున్న కేసీఆర్.. ముఖ్యమంత్రి అయ్యాక 250 ఎకరాల వరకు కబ్జా చేశారని ఆరోపించారు. 

ఇక, ప్రధాని బీసీ, ఎస్సీ సభలు అంటున్నారు.. గతంలో చాలా సార్లు మందకృష్ణ ప్రధానిని కలిసే ప్రయత్నం చేశారు.. ఎన్నిసార్లు ప్రయత్నించినా కలవని ప్రధాని.. ఇప్పుడు ఎందుకు కలిశారు..? అని నిలదీశారు. ఎందుకు అన్ని డ్రామాలు ఆడారు స్టేజ్ పై.. మంచి నటులు కూడా అంతబాగా నటించరేమో.. అంటూ ఎద్దేవా చేశారు. కానీ, బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడ సీట్లు పెరగవు.. బీజేపీ కన్నా నోటా ఓట్లు ఎక్కువ వస్తాయి.. బీజేపీ పార్టీకి బీసీ, సామాన్యులకు, మైనారిటీ, ఎస్సీలకు వ్యతిరేకులు అని వ్యాఖ్యానించారు.

బీజేపీ, బీఆర్ఎస్‌, ఎంఐఎం   కలిసి దేశంలో డ్రామాలు చేస్తున్నారని దుయ్యబట్టారు నారాయణ.. జైల్ లో ఉండాల్సిన వారు బయట ఉంటున్నారు.. బయట ఉండాల్సిన వారు జైల్ లో ఉంటున్నారన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నామినేషన్ వేసే రోజు రాష్ట్ర , కేంద్ర సంస్థలు దాడులు చేశాయని గుర్తుచేశారు. కానీ  సబితా ఇంద్రారెడ్డిపై చేసేది నిజమైన ఐటీ దాడులు కాదన్నారు.   బీజేపీ, బీఆర్ఎస్‌, ఎంఐఎంకి ఓటు వేయొద్దు.. ఒక్కదెబ్బకు అంటే ఒక్క ఓటు కి మూడు పిట్టలు పడిపోవాలి.. కమ్యూనిస్టులకు, కాంగ్రెస్ కి ఓటు వెయ్యండి.. బీఆర్ఎస్‌ని గద్దె దింపండి అంటూ పిలుపునిచ్చారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.

ALSO READ :- దీపావళి కాంతులు అంతరిక్షాన్ని తాకాయి.. అద్భుతం ఆవిష్కరణ