బిగ్ బాస్ షోపై మరోసారి నారాయణ ఆగ్రహం

బిగ్ బాస్ షోపై మరోసారి నారాయణ ఆగ్రహం

తెలుగు బిగ్ బాస్ షోపై సీపీఐ జాతీయ నేత నారాయణ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. హోస్ట్ గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జునకు కొన్ని ప్రశ్నలు సంధించారు. బిగ్ బాస్ హౌస్ లో పెళ్లి కాని వారి సంగతి ఏంటని అన్నారు. ‘భార్య భర్తలకు లైసెన్స్ ఇచ్చారు సరే.. మరి షోలో పెళ్లి కాని వాళ్లు కూడా ఉన్నారుగా’ అని ప్రశ్నించారు.

గతంలోనూ బిగ్ బాస్ షో పై తీవ్రస్థాయిలో నారాయణ ఆరోపణలు చేశారు. షో ను రద్దు చేయాలని, ఇలాంటి షోలకు పర్మిషన్లు ఇవ్వొద్దని నారాయణ డిమాండ్ చేశారు. బిగ్ బాస్ షో నిలిపివేసే వరకూ తాను పోరాటం చేస్తానని గతంలోనే స్పష్టం చేశారు.