కమ్యూనిస్టులు ఏకం కావాలి : జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి

కమ్యూనిస్టులు ఏకం కావాలి : జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి
  •     సీపీఐ పాటల సీడీ ఆవిష్కరణలో  జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి 

హైదరాబాద్, వెలుగు: కమ్యూనిస్టులంతా ఏకం కావాలని, కలిసికట్టుగా ముందుకు సాగితే అధికారం చేపట్టడం అసాధ్యమేమి కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. 18న ఖమ్మంలో నిర్వహించనున్న సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు పెద్దఎత్తున తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్​లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూం భవన్ లో బుధవారం తెలంగాణ అభ్యుదయ రచయిత సంఘం (అరసం) ఆధ్వర్యంలో కవి చంద్రమోహన్ గౌడ్ రచించిన ‘చలో ఖమ్మం’ పాటల సీడీని ఆవిష్కరించారు. 

ఈ సందర్బంగా పల్లా వెంకటరెడ్డి మాట్లాడారు. స్వాతంత్ర్య సంగ్రామంలో నాడు సీపీఐ, ప్రజా సంఘాలు కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. సంపూర్ణ స్వాత్రంత్యం కావాలన్న నినాదంతో మొక్కవోని దీక్షతో ఉద్యమించిన ఏకైక పార్టీ సీపీఐ అని, ఆ తర్వాత దేశ అభివృద్ధిలో ప్రజల ఆర్థిక  స్వావలంబన కోసం సంక్షేమ పథకాల అమల్లో  పార్టీ క్రీయాశీలక పాత్ర పోషించిందని తెలిపారు.  కందిమళ్ల ప్రతాప రెడ్డి మాట్లాడుతూ.. అక్షర జ్ఞానం లేని ప్రజల్లో తమ పాటలు, రచనల ద్వారా చైతన్యం నింపిన ఘన చరిత్ర ఇప్టా, ప్రజానాట్య మండలిదేనని చెప్పారు.