మరి ప్రతిపక్షాల ఆఫీసులకు జాగలియ్యరా?: చాడ

మరి ప్రతిపక్షాల ఆఫీసులకు జాగలియ్యరా?: చాడ

హైదరాబాద్, వెలుగు: ‘టీఆర్ ఎస్ పార్టీ కార్యాలయాల కోసం జిల్లాల్లో స్థలాలు కేటాయించిన ప్రభుత్వానికి.. ప్రతిపక్షాల కార్యాలయాలకు కూడా కేటాయించాలని తెల్వదా?’ అని అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే సామెతలా టీఆర్‌‌ఎస్‌‌ 32 జిల్లాల్లో పార్టీ ఆఫీసులకు స్థలాలను కేటాయించుకున్నదని విమర్శించారు. ఆఫీసుల కోసం స్థలాలు కేటాయించాలని సీపీఐ జిల్లా కమిటీలు.. కలెక్టర్లకు దరఖాస్తులు పెట్టినా  స్పందన లేదన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ చొరవ తీసుకుని, సీపీఐకి కూడా అన్ని జిల్లాల్లో స్థలాలు కేటాయించాలని కోరారు.