
హైదరాబాద్: పార్టీలో కీలక బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సీపీఐ నారాయణ ప్రకటించారు. గత కొన్నేండ్లుగా సీపీఐ జాతీయ కా ర్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆయన తన పదవి నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. 75 ఏండ్ల వయస్సు నిండడంతో ఈ నిర్ణయం తీసుకున్న ట్లు చెప్పారు.
ఇకపై సీపీఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ గా నారాయణ కొనసాగనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చండీగఢ్ లో జరిగిన సీపీఐ 25వ మహాసభలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. 75ఏండ్లు దాటితే రిలీవ్ కావాలని నిర్ణయించిందని తెలిపారు. అందుకే నాయకత్వ స్థాయి నుంచి పదవీ విరమణ చేశానని చెప్పారు. పార్టీలో అంతర్గత సమస్యల పరిష్కారం కోసం ఇకపై పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మాత్రం డి.రాజా పదవీకాలాన్ని పొడిగిస్తూ జాతీయ మహాసభల్లో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.