సీపీఎం మూడోజాబితా రిలీజ్

సీపీఎం మూడోజాబితా రిలీజ్
  • సీపీఎం మూడోజాబితా రిలీజ్
  • మూడు సెగ్మెంట్లకు అభ్యర్థులు ఖరారు

హైదరాబాద్, వెలుగు :  అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల మూడో లిస్టును సీపీఎం ప్రకటించింది. కోదాడ నియోజకవర్గం నుంచి మట్టిపల్లి సైదులు, మునుగోడు నుంచి దోనూరు నర్సిరెడ్డి, ఇల్లందు నుంచి దుగ్గి కృష్ణ పోటీ చేస్తారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. ఇప్పటికే 16 మంది పేర్లను ప్రకటించిన సీపీఎం, మంగళవారం మరో 3 సెగ్మెంట్లలో పోటీ చేసే లిస్టును ప్రకటించింది. దీంతో మొత్తం 19 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నట్టు ఆ పార్టీ నేతలు తెలిపారు.