ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో మోడీ చరిష్మా ఎంతో తెలుస్తది

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో మోడీ చరిష్మా ఎంతో తెలుస్తది

రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తుందని.. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు సీపీఎం పొలిట్ బ్యురో సభ్యులు ప్రకాష్ కారత్ . రాష్ట్రాల ఆర్థిక లోటు ఉన్నప్పుడు కేంద్రం నుండి ప్రత్యేక గ్రాంటు మంజూరు చేయాల్సి ఉంటుంది.. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తమకు కేంద్రం నుండి రావల్సిన రావడం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని విషయాల్లో బీజేపీ యేతర ప్రభుత్వాలతో కలిసి పోరాడాలన్నారు.

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలను బట్టి మోదీ చరిష్మా ఎంతో తెలుస్తుందన్నారు. యూపీలో ఎస్పీకి మద్దతిస్తున్నామన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో (యూపీ,గోవా, ఉత్తరాఖండ్,మణిపూర్, పంజాబ్) బీజేపీని ఓడించడానికి ఇతర పార్టీలకు మద్దతు ఇస్తున్నామన్నారు. తమ పార్టీ బలోపేతంపై ప్రత్యేక కార్యాచరణతో జాతీయ మహాసభల్లో చర్చిస్తామన్నారు.  కరోనా,లాక్ డౌన్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని.. ప్రజలు ఉద్యోగాలు లేక ఆర్థిక స్థితి బాగా లేదన్నారు. ప్రతి కుటుంబానికి నెలకు రూ. 7500 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఫిబ్రవరి 1న ప్రవేశపట్టే  కేంద్ర బడ్జెట్  ప్రజలకు చేరువయ్యే విధంగా ఉండాలన్నారు.  హెల్త్,ఎడ్యుకేషన్ అగ్రి కల్చరల్ పై దృష్టి సారించాలన్నారు.