బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి అన్యాయం : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ

బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి అన్యాయం : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బడ్జెట్‌లో సంక్షేమ రంగాలకు కోత పెట్టి పేదలు, దళితులు, రైతులకు అన్యాయం చేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్​ వెస్లీ శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. వ్యవసాయం, దళిత సంక్షేమం, గృహనిర్మాణం, నీటిపారుదల, విద్యుత్ తదితర కీలక రంగాలకు గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి 
నిధులు తగ్గించారన్నారు.

ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుకు స్పష్టమైన ప్రతిపాదనలు లేవని ఆరోపించారు. రైతు భరోసాకు రూ.25 వేల కోట్లు అవసరం ఉండగా, కేవలం రూ.18 వేల కోట్లు మాత్రమే కేటాయించారని వాపోయారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇవ్వాల్సిన రూ.2,500 ప్రస్తావనే లేదని, కౌలు రైతులను పట్టించుకోలేదని విమర్శించారు. వ్యవసాయ కూలీలకు ప్రకటించిన రూ.12 వేల సాయం ఈ బడ్జెట్‌లో కనిపించలేదన్నారు.