హైదరాబాద్, వెలుగు: చేయూత పింఛన్ల దరఖాస్తుల ప్రక్రియలో కీలకమైన పేద వర్గాలను విస్మరించడం దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వృద్ధులు, బీడీ కార్మికులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల నుంచి కూడా దరఖాస్తులను స్వీకరించి, వారందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రతి అర్హుడికీ సామాజిక భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు క్షేత్రస్థాయిలో నిరుపేదల దరఖాస్తులను స్వీకరించకపోవడం సరికాదన్నారు. దరఖాస్తులకు విధించిన ఆగస్టు 31 తుది గడువును కూడా పొడిగించాలని కోరారు.
