ఆరు గ్యారంటీలను అమలు చేయాల్సిందే : తమ్మినేని వీరభద్రం

ఆరు గ్యారంటీలను అమలు చేయాల్సిందే : తమ్మినేని వీరభద్రం
  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

వీపనగండ్ల, వెలుగు : ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌‌ విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. వనపర్తి జిల్లా వీపనగండ్లలో ఆదివారం జరిగిన సీపీఎం మహాసభలో ఆయన మాట్లాడారు. అనేక హామీలు ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గెలిచిన తర్వాత వాటిని పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ఆరు గ్యారంటీలను సీఎం రేవంత్‌‌రెడ్డి తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని, లేదంటే సీపీఎం ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌‌ అధికారంలోకి వచ్చాక మహిళలకు ఫ్రీ బస్‌‌ తప్ప మరే హామీ నెరవేరలేదన్నారు. రుణమాఫీ కాక చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రతి రైతుకు రుణమాఫీ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూల్చడం సరికాదన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు జాన్‌‌ వెస్లీ, సాగర్, వెంకట్‌‌రాంరెడ్డి, జిల్లా కార్యదర్శి జబ్బార్‌‌, మండల కార్యదర్శి బాల్‌‌రెడ్డి, నాయకులు ఆంజనేయులు, భాస్కర్‌‌రెడ్డి, మాజీ సర్పంచ్‌‌ మౌలాలి, ఆశన్న, లక్ష్మి పాల్గొన్నారు.