పీఆర్టీయూ అభ్యర్థి చెన్నకేశవరెడ్డికి..సీపీఎస్ఈయూ మద్దతు

పీఆర్టీయూ అభ్యర్థి చెన్నకేశవరెడ్డికి..సీపీఎస్ఈయూ మద్దతు

హైదరాబాద్, వెలుగు: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో పీఆర్టీయూ అభ్యర్థి చెన్నకేశవరెడ్డికి మద్దతిస్తున్నట్టు సీపీఎస్​ ఎంప్లాయీస్ యూనియన్ ప్రకటించింది. గురువారం టీఎస్ సీపీఎస్​ఈయూ ఆఫీసులో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు స్థితప్రజ్ఞ, కల్వల్ శ్రీకాంత్ లను పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్ రెడ్డి కలిసి మద్దతు కోరారు. సీపీఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్న లిఖితపూర్వక​ హామీతో చెన్నకేశవరెడ్డికి మద్దతు ప్రకటిస్తున్నట్టు స్థితప్రజ్ఞ వెల్లడించారు. పాత పింఛన్ వ్యతిరేక శక్తులను ఓడించాలనే ఉద్దేశంతో, సంఘం  ప్రైమరీ మెంబర్ల ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో అలుగుబెల్లి నర్సిరెడ్డి, రఘోత్తంరెడ్డి, వాణిదేవీ, రాజేశ్వర్ రెడ్డి తదితరులు సీపీఎస్ ఉద్యోగుల మద్దతుతోనే గెలిచారని గుర్తుచేశారు.