పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి..సీపీఎస్‌‌ఈయూ స్టేట్ ప్రెసిడెంట్ స్థితప్రజ్ఞ విజ్ఞప్తి

పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి..సీపీఎస్‌‌ఈయూ స్టేట్ ప్రెసిడెంట్ స్థితప్రజ్ఞ విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 2.6 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు, టీచర్ల భవిష్యత్​పై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని సీపీఎస్‌‌ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ కోరారు. సోమవారం సచివాలయంలో సీఎస్ సంజయ్ జాజును ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, నేతలతో కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రంలో రిటైర్ అయిన సుమారు 2 వేల మంది సీపీఎస్ ఉద్యోగులు నామమాత్రపు పెన్షన్‌‌తో ఆర్థికంగా చితికిపోతున్నారని, వారిని ఆదుకోవాలంటే పాత పెన్షన్ విధానం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వెంటనే ఓపీఎస్‌‌ను అమలు చేయాలని డిమాండ్​చేశారు. దీంతోపాటు 2023 నుంచి పెండింగ్‌‌లో ఉన్న డీఏ బకాయిలను ఒకే విడుతలో రిలీజ్ చేయాలన్నారు.