- హైదరాబాద్లో స్కిక్ కేర్ల అక్రమాలపై ఉక్కుపాదం
- కొండాపూర్‌లోని క్లినిక్‌లపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దాడులు
- రూల్స్‌కు విరుద్ధంగా నడుస్తున్న నియోస్కిన్, త్రయా, ఓఆర్ఏ ఎస్తేటిక్స్.. చర్యలకు సిఫార్సు
హైదరాబాద్, వెలుగు: సిటీలో స్కిన్, హెయిర్ కేర్ క్లినిక్‌ల పేరుతో సాగుతున్న అక్రమాలపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కొరడా ఝుళిపించింది. బుధవారం కొండాపూర్‌లోని పలు స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్‌ల్లో కౌన్సిల్ ప్రతినిధులు ఆకస్మిక తనిఖీలు చేశారు. కనీస అర్హతలు లేకుండానే రూల్స్‌కు విరుద్ధంగా చికిత్సలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
కొండాపూర్‌లోని నియోస్కిన్ క్లినిక్‌లో అర్హత కలిగిన డెర్మటాలజిస్టులు, సంబంధిత శాఖల అనుమతులు లేకుండానే స్కిన్, హెయిర్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే ఓఆర్‌ఏ ఎస్తేటిక్స్ క్లినిక్‌లో డెంటిస్టులు చర్మ, హెయిర్ సంబంధిత చికిత్సలు చేయడంపై కౌన్సిల్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ప్రముఖ సంస్థ త్రయా హెయిర్ లాస్ సొల్యూషన్స్‌కు క్లినికల్ రిజిస్ట్రేషన్ లేకపోవడమే కాకుండా, డెర్మటాలజిస్టుల పర్యవేక్షణ లేకుండా కేవలం ఆన్‌లైన్ కన్సల్టేషన్ల ద్వారా జుట్టు రాలడం వంటి సమస్యలకు మందులు ఇస్తున్నట్లు నిర్ధారించారు. అక్రమాలకు పాల్పడుతున్న ఈ సంస్థలపై ఎన్‌ఎంసీ చట్టం-2019 ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు కౌన్సిల్ ప్రకటించింది. రూల్స్ అతిక్రమిస్తున్న క్లినిక్‌లకు సహకరిస్తున్న రిజిస్టర్డ్ డాక్టర్లపై మెడికల్ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని, వారి లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించింది.
వెంటనే ఈ క్లినిక్‌లను సీజ్ చేయాలని, యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్, డీఎంహెచ్‌ఓలకు సిఫారసు చేసిందితనిఖీల్లో కౌన్సిల్ లీగల్ అండ్ యాంటీ-క్వాకరీ కమిటీ చైర్మన్ డాక్టర్ ఎ. సన్నీ డేవిస్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు విష్ణు కడలి, కో-ఆప్టెడ్ సభ్యురాలు శివరంజని, కార్తీక్ నాగుల, విజయ్ పాల్గొన్నారు.
