V6 News

తమిళనాడులో పేలుడు.. ఒకరి మృతి

తమిళనాడులో పేలుడు.. ఒకరి మృతి

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. నామక్కల్ జిల్లా మోగనూరులోని అర్ధరాత్రి ఓ ఇంట్లో నాటు బాంబులు పేలాయి. ఈ  ఘటనలో 70 ఏళ్ల వృద్దురాలు చనిపోగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పారు. 

తిల్లే ఫైర్ వర్క్స్ నిర్వహిస్తున్న తిల్లేక్ కుమార్.. తన ఇంట్లో పేలుడు పదార్థాలు, ఫైర్ క్రాకర్స్ ను నిల్వ చేశాడు. అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తి బాణాసంచాను పేల్చడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. క్షణాల్లోనే ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది. బాణాసంచాను పేల్చిన వ్యక్తి కుటుంబసభ్యులతో సహా పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.