
బషీర్‌బాగ్, వెలుగు: క్రెడిట్ కార్డుపై ఉన్న ఫైన్ మాఫీ చేస్తామని నమ్మబలికి సైబర్‌నేరగాళ్లు ఓ ప్రైవేట్ఉద్యోగిని మోసం చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. సిటీకి చెందిన ప్రైవేట్ఉద్యోగి(48)కి ఇటీవల స్కామర్లు కాల్చేశారు. ఎస్బీఐ క్రెడిట్ కార్డు డిపార్ట్‌మెంట్‌నుంచి అని చెప్పారు. ‘మీరు క్రెడిట్‌కార్డు వాడకపోవడంతో ఫైన్పడింది. ఆ ఫైన్అమౌంట్ ను మేము మాఫీ చేస్తాం. ప్రాసెస్ చేయడానికి వీడియో కాల్ చేయండి’ అని తెలిపారు.
నిజమేనని నమ్మిన ప్రైవేట్ఉద్యోగి స్కామర్లు చెప్పిన నంబర్‌కు వీడియో కాల్ చేశాడు. క్రెడిట్ కార్డు వివరాలు, సీవీవీ నంబర్చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత క్రెడిట్‌కార్డు నుంచి డబ్బు డెబిట్అవుతున్నట్లు మెసేజ్‌లు, ఓటీపీలు వచ్చాయి. కాల్ డిస్కనెక్ట్ చేసి చెక్‌చేసుకోగా, మొత్తం రూ.1,80,000 డెబిట్ అయినట్లు గుర్తించాడు. అయితే అతని క్రెడిట్‌కార్డు లిమిట్ రూ.50 వేలు కాగా, అంతకు మించి డెబిట్కావడంతో కంగుతిన్నాడు. వెంటనే ఆన్లైన్లో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.