క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంపు వల్ల లాభాలు.. నష్టాలు

క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంపు వల్ల లాభాలు.. నష్టాలు
  • ఎక్కువ లిమిట్‌‌ ఉంటే ఎక్కువ డబ్బు ఉన్నట్టే
  • ఎక్కువ మొత్తం లోన్‌‌ కూడా పొందొచ్చు
  • అతిగా ఖర్చు పెడితే మాత్రం ట్రబుల్స్‌‌ తప్పవు
  • అప్పుల ఊబిలో చిక్కుకునే ప్రమాదం

బిజినెస్‌‌‌‌ డెస్క్, వెలుగు: క్రెడిట్‌‌‌‌కార్డు కంపెనీలు మొదట కార్డు ఇచ్చేటప్పుడు క్రెడిట్‌‌‌‌ లిమిట్‌‌‌‌ తక్కువ ఇస్తాయి. కార్డుహోల్డర్‌‌‌‌ ట్రాన్సాక్షన్లు, కరెక్ట్‌‌‌‌ టైమ్‌‌‌‌కు బిల్‌‌‌‌ చెల్లించడం, నెల ఆదాయం వంటి అంశాలను లెక్కలోకి తీసుకొని క్రెడిట్‌‌‌‌ లిమిట్‌‌‌‌ పెంచడానికి ఆఫర్ ఇస్తాయి. ఇలాంటి ఆఫర్‌‌‌‌ను ఒప్పుకోవాలా ? వద్దా ? అనే విషయమై చాలా మందికి కన్‌‌‌‌ఫ్యూజన్‌‌‌‌ ఉంటుంది. క్రెడిట్‌‌‌‌లిమిట్ ఎక్కువ తీసుకుంటే అప్పుల పాలవుతామనే భయం వెన్నాడుతుంది. లిమిట్ తక్కువ ఉంటే ఎక్కువ ఖర్చు చేయడానికి వీలుండదు. ఈ నేపథ్యంలో క్రెడిట్‌‌‌‌ లిమిట్‌‌‌‌ను పెంచుకోవడంలో ఉండే మంచిచెడులు ఏంటో చూద్దాం…

లాభాలు

క్రెడిట్‌‌‌‌ స్కోర్‌‌‌‌ పెరుగుతుంది…

క్రెడిట్‌‌‌‌ లిమిట్‌‌‌‌లో 30 శాతం కంటే ఎక్కువ వాడుకుంటే.. కార్డుహోల్డర్‌‌‌‌కు డబ్బుపరమైన అవసరాలు ఎక్కువగా ఉన్నాయని క్రెడిట్‌‌‌‌ బ్యూరోలు భావిస్తాయి. అంటే..కార్డును ఎక్కువ వాడితే క్రెడిట్‌‌‌‌స్కోరు తగ్గుతుంది. క్రెడిట్‌‌‌‌ లిమిట్‌‌‌‌ను పెంచుకుంటే ఈ సమస్య ఉండదు. ఉదాహరణకు మీ కార్డుకు రూ.40 వేల క్రెడిట్‌‌‌‌ లిమిట్‌‌‌‌ ఉంటే 30 శాతం.. అంటే రూ.12 వేల కంటే ఎక్కువ వాడితే స్కోర్‌‌‌‌ తగ్గుతుంది. క్రెడిట్‌‌‌‌ లిమిట్‌‌‌‌ రూ.లక్ష ఉంటే రూ.30 వేల వరకు వాడుకోవచ్చు. స్కోర్‌‌‌‌ తగ్గుతుందన్న భయం ఉండదు. కొన్ని కంపెనీలు క్రెడిట్‌‌‌‌ లిమిట్‌‌‌‌ను పెంచేందుకు ఒప్పుకోవు. అలాంటి సమయాల్లో ఇతర కంపెనీల నుంచి కార్డులు తీసుకోవడం బెటర్‌‌‌‌.

డబ్బు సమస్యల నుంచి బయటపడొచ్చు..

జాబ్‌‌‌‌ పోయినప్పుడు, ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినప్పుడు, యాక్సిడెంట్‌‌‌‌ జరిగినప్పుడు హఠాత్తుగా డబ్బు కావాల్సి వస్తుంది. ఇలాంటి టైంలో ఎక్కువ క్రెడిట్‌‌‌‌ లిమిట్‌‌‌‌ ఉన్న కార్డులు మనల్ని ఆదుకుంటాయి. ఎవరినీ అప్పు అడగాల్సిన అవసరం ఉండదు. మొత్తం బిల్లు చెల్లించడం సాధ్యం కాని వాళ్లు ఈఎంఐల ద్వారా నెలకు కొంత డబ్బు కట్టొచ్చు.  ఫైన్లు పడటం, స్కోర్‌‌‌‌ తగ్గడం వంటి ఇబ్బందులు ఉండవు.

ఎక్కువ లోన్‌‌‌‌ రావొచ్చు

క్రెడిట్‌‌‌‌ లిమిట్‌‌‌‌ ఎక్కువ ఉన్న కార్డుహోల్డర్లకు పెద్ద మొత్తంలో లోన్లు ఇవ్వడానికి బ్యాంకులు ఆఫర్లు ఇస్తాయి. ఇవి ప్రి–అప్రూవ్డ్‌‌‌‌ లోన్లు కాబట్టి నిమిషాల్లో డబ్బు మన అకౌంట్లో పడుతుంది. ఎలాంటి డాక్యుమెంటేషన్‌‌‌‌, షూరిటీలు అవసరం లేదు. అయితే కార్డు బిల్లును గడువు తేదీలోగా కట్టేవాళ్లకు మాత్రమే ఇలాంటి ఆఫర్లు వస్తాయి. క్రెడిట్‌‌‌‌ హిస్టరీ బాగా లేకపోతే లోన్‌‌‌‌ రావడం కష్టమే!

నష్టాలు

మరింత అప్పు పెరిగే ప్రమాదం

క్రెడిట్‌‌‌‌ లిమిట్‌‌‌‌ ఎక్కువ ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు ఖర్చు పెడితే మాత్రం అప్పులు ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. క్రెడిట్‌‌‌‌ లిమిట్‌‌‌‌ పెరగ్గానే కొందరు మునుపటి కంటే ఎక్కువ ఖర్చు చేసి ఇబ్బందుల పాలవుతారు. ఎమర్జెన్సీ అయితే తప్ప మన ఆదాయానికి మించి కార్డును వాడకూడదు.

ఎక్కువ వడ్డీ కట్టాలి

వాడుకున్న మొత్తాన్ని చెల్లించకపోతే కంపెనీలు భారీగా వడ్డీని వడ్డిస్తాయి. ఈఎంఐ విధానంలో చెల్లించినా కనీసం 12 శాతం వడ్డీని భరించాలి. ఎక్కువ ఈఎంఐల వల్ల ఎక్కువ వడ్డీ కట్టడమే కాదు క్రెడిట్‌‌‌‌స్కోర్‌‌‌‌ తగ్గే ప్రమాదం ఉంటుంది. వీలైనంత వరకు లాస్ట్‌‌‌‌ డేట్‌‌‌‌ లోపు మొత్తం బిల్లు కట్టేయడం మంచిది.

చోరీ అయితే ఎన్నో కష్టాలు…

ఎక్కువ క్రెడిట్‌‌‌‌ లిమిట్‌‌‌‌ ఉన్న కార్డు చోరీ అయి, అందులోని మొత్తాన్ని వాడుకుంటే కార్డుహోల్డర్‌‌‌‌ తీవ్రంగా నష్టపోతాడు. మొత్తం బిల్లును చెల్లించాల్సి వస్తుంది. కొత్త కార్డుకు అదనంగా డబ్బు చెల్లించాలి. కాబట్టి ఎక్కువ క్రెడిట్‌‌‌‌ లిమిట్‌‌‌‌ ఉన్న కార్డు హోల్డర్లు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.